అసమర్ధుని జీవయాత్ర

Sasank Chilamkurthy | |

రచయత : తరిపురనేని గోపిచంద
పరిచయం : ఒక అసమర్థుని మనోవైజ్ఞానిక విశ్లేషణ. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
నేను పూర్తిచేసినది : 1 మే 2017న
మొదలుపెట్టింది : 30 ఏప్రిల్ 2017న

ఈ పుస్తకం కూడా చాలా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి పుస్తకం ఏ భాషలోనూ చదవలేదు అనిపించింది. ఈ పుస్తకం ఒక అసమర్థుని మనోస్థితిని వెశ్లేషిస్తుంది - అతడి బాల్యం నుంచి మరణం దాకా. బహుశా Madame Bovary ఒకటి ఇదే అంశంపై ఉన్న నేను చదివిన ఇంకో పుస్తకం.

రచయిత ఎక్కడా వెనుకాడలేదు అనిపించింది. చివరకి మన కథానాయికుడు సమర్థుడు అవ్వడు. బదులుగా పిచ్చి ఎక్కి చచ్చిపోతాడు. మేనమామ రాసిన లేఖ బహుశా పుస్తకానికి హైలైట్. ఆ లేఖ చదివిన తరవాత మనం నిస్వార్థమైంది అనుకుంటున్న కధానాయకుడి కుటుంబం, అంత నిస్వార్థమైంది కాదేమో, కీర్తి కోసం ప్రాకులాడిపోయి నాశనమయింది అనిపిస్తుంది.